కోడెల వ్యవహారంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కోడెల వ్యవహారంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన ఫ్యామిలీ వ్యవహారం రోజురోజుకూ మరింత ముదురుతోంది. రోజుకో కేసు లాగా.. ఆయన ఫ్యామిలీపై వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారమైతే మరీ హాట్‌టాపిక్‌ అయిపోయింది. అయితే, కోడెల ఫర్నిచర్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తప్పు జరిగితే చట్టపరమైన యాక్షన్ తీసుకుంటే, తమ పార్టీ అడ్డుచెప్పదని స్పష్టం చేశారు. కానీ, ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడకూడదని చంద్రబాబు హెచ్చరించారు.

ఇక, ఈ నెల 30 నాటికి నాలుగు రిజర్వాయర్లలో 419 టీఎంసీల మేర నీటి నిల్వకు అవకాశం ఉందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. వరద నిర్వహణకు ప్రభుత్వానికి సరిపోయే సమయం ఉందని, రాయలసీమలో ప్రాజెక్టులు అన్ని ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు. మూడు రోజులు సాగర్‌లో నీటిని నిలిపి ఒక్క సారిగా వదిలారని మండిపడ్డారు. బ్యారేజ్ నుంచి 6 లక్షలు నీరు కిందికి వెళ్లినా నష్టం ఉండేది కాదన్నారాయన. రాజధాని ముంచాలనే ప్రభుత్వ  ఆలోచన అని ఘాటుగా విమర్శించారు. తన  ఇంటికి తప్ప.. రాష్ట్రంలో ఎక్కడా నోటీస్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. వరదను నిర్వహించలేని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత కోల్పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇక్కసారి గా నీళ్లు వదిలారు.... ఒక్కసారిగా గేట్లు మూసేశారని మండిపడ్డారు. రాయల సీమకు 50 టీఎంసీ ల నీరు ఇచ్చే అవకాశం వదిలేశారని జారవిడిచారన్నారాయన. ఇంత వరదలో పోతిరెడ్డిపాడు నీటి విడుదలపై తెలంగాణ అభ్యంతరం చెప్పిందని, సముద్రంలో నీరు కలిసే సమయంలో నీళ్లు మళ్లింపు చేసుకుంటే ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం తమ స్నేహితులు అని చెప్పే జగన్ సర్కార్, ఈ ఫిర్యాదుపై ఏమి చెపుతుందని నిలదీసారు. మంత్రి బొత్స ఇప్పుడు రాజధాని కి ముంపు ముప్పు అంటున్నాడని, ముంబైకి, చెన్నైకి నీళ్లు వచ్చాయి... రాజధాని మార్చేస్తారా అని ప్రశ్నించారు.  మరోవైపు కీయ కార్ల పరిశ్రమ వల్ల 20 వేల కోట్ల భారం అని మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించడమేంటన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇసెంటివ్ లేకుండా పరిశ్రమలు పెడతారా అని ప్రశ్నించారాయన. అవినీతి అని అన్ని ప్రాజెక్ట్ లు ఆపేస్తారా నిలదీసారు.