తొడగొట్టి చెబుతున్నా చంద్రబాబే సీఎం..!

తొడగొట్టి చెబుతున్నా చంద్రబాబే సీఎం..!

తొగడొట్టి చెబుతున్నా.. ఏపీలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయే.. మళ్లీ ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడే నని వెల్లడించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... నేడు శ్రీరాముడి కళ్యాణం.. మే 23న ఆంధ్ర శ్రీరాముడు చంద్రబాబుకి ప్రజలు పట్టాభిషేకం చేయబోతున్నారని అన్నారు. ఫలితాలు రాకుండానే వైసీపీ వాళ్లు దాదాగిరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకన్న.. ఇలాంటి వాళ్లు వస్తే.. ప్రజలు బతకగలరా?... రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వైఫల్యాలపై చంద్రబాబు పోరాటం చేస్తుంటే.. ఓటమి భయం అంటూ వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు భయపడే రకమైతే ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు వస్తారని నిలదీశారు. బీజేపీ, వైసీపీలు నాలుగు రోజులుగా చంద్రబాబుపై మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ... దేశానికి శాడిస్ట్ ప్రధానిగా మోడీ ఉండటం ఈవీఎంలపై అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల రోజు అసలు ఈవీఎంలు ఎందుకు పనిచేయలేదు? దీని వెనుక కుట్ర ఉంది కాబట్టే అలా జరిగిందన్నారు. పులి వెనుక అడుగువేసిందంటే అది పంజా విసరడానికే.. ఉడత బెదిరింపులకు బెదిరేదిలేదని హెచ్చరించారు బుద్దా వెంకన్న.