టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు

టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. మీ భవిష్యత్తు.. నా బాధ్యత’ అని మేనిఫెస్టోకు నామకరణం చేశారు. ప్రధానంగా రైతులకు, సామాన్యులకు,మహిళలకు ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. అంతకుముందు దుర్గమ్మను దర్శించుకుని మేనిఫెస్టోకు పూజలు చేయించారు. అనంతరం ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.

మేనిఫెస్టో హైలెట్స్ః
* అన్నదాతా సుఖీభవ పథకం ఐదేళ్లు అమలు చేస్తాం
* రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
* రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా
* రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి.
* రైతులకు లాభసాటి ధరలు లభించేలా వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థల బలోపేతం
* ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్లు సరఫరాకు ప్రత్యేక చర్యలు 
* రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చర్యలు
* గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి  రాయితీలు
* 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరింపు
* మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్పింక్లర్‌  వ్యవస్థల ఏర్పాటు
* కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు
* యువతకు ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తాం.
* నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతాం. ఇంటర్‌ పాసైతే చాలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 
* ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తాం.
* డెయిరీ రంగంలో కూడా ఏపీ మొదటి స్థానంలో ఉంచుతాం.
* ఫించన్ రూ. 3: వేలు.. చంద్రన్న భీమా రూ. 10 లక్షలు
* మాదిగ కార్పోరేషన్, రెల్లీ కార్పోరేషన్, యానాదుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు
* చేపల వేటకెళ్లే మత్స్యకారులకు క్రాప్ హాలిడే కింద ఇచ్చే మొత్తం రూ. 10 వేలకు పెంచుతాం
* బ్రహ్మాణ, వడ్డెర్లకు ఎమ్మెల్సీ స్థానాలు.
* అర్చకులు, ఇమామ్-మౌజమ్, పాస్టర్లుకు ఇళ్ల నిర్మాణం
* రెండు కోట్ల ఎకరాలకు నీళ్లివ్లబోతున్నాం
* హర్టీకల్చర్ హబ్ గా తయారు చేస్తాం.. ఆదాయం పెంచుతాం
* పోలవరం పూర్తి చేస్తాం.
* 62 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
* ఐదు అద్భుత నగరాల్లో ఒకటిగా అమరావతి
* రాబోయే ఐదేళ్లూ పసుపు-కుంకమ ఇస్తాం
* అర్చకులు, ఇమామ్-మౌజమ్, పాస్టర్లుకు ఇళ్ల నిర్మాణం
* అమ్మకు వందనం పేరుతో విద్యార్ధుల తల్లులకు రూ. 18 వేలు
* ఏపీని హెల్త్ హబ్ చేస్తాం
* నాణ్యమైన వైద్య సేవలను రాష్ట్రానికే తెస్తాం