ఇది నా అదృష్టం....

ఇది నా అదృష్టం....

పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 58 శాతం పూర్తయ్యాయి... 2019 నాటికి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... పోలవరం గ్యాలరీని ప్రారంభించి... కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి అందులో వాక్ చేసిన ఆయన... అనంతరం మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత రావడం తన అదృష్టమన్నారు... ఐదుకోట్ల ప్రజల కలల జలసౌధం పోలవరమన్న చంద్రబాబు... ఈ ప్రాజెక్టు దక్షిణాంధ్రకు నవజీవనం, నవ్యాంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని పేర్కొన్నారు. నిద్రపోయే సమయంలో కూడా గుర్తొచ్చేది పోలవరమేనన్న ఏపీ సీఎం... పోలవరం గ్యాలరీ వాక్ చేస్తున్న సమయంలో జన్మచరితార్ధం అయిందని భావించానన్నారు. రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తి ఇచ్చిన రోజు ఇదే అన్నారాయన. కొందరు అయప్ప, భవానీ దీక్షలు చేస్తుంటారు... అదే విధంగా తాను జలదీక్ష చేపట్టానని... ఇప్పటికి 26సార్లు ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చానని గుర్తుచేసుకున్నారు.