ఈషా అంబానీ పెళ్లి వేడుకకు చంద్రబాబు

ఈషా అంబానీ పెళ్లి వేడుకకు చంద్రబాబు

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుమార్తె పెళ్లి వేడుకలకు దేశ విదేశాల నుంచి అతిథులు తరలివస్తున్నారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ముందస్తు పెళ్లి వేడుకలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముంబై వెళ్లనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు మిట్టల్ ఇండస్ట్రీస్ అధినేత లక్ష్మి మిట్టల్, ఉషా మిట్టల్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ శిక్కా, నోకియా నుంచి రాజీవ్ సూరీ, హఫింగ్టన్ పోస్ట్ నుంచి అరియానా, టీవీ హోస్ట్ ఫరీద్ జకారియా, అనిల్ కపూర్, డేవిడ్ ధావన్, విద్యాబాలన్, సిద్ధార్థరాయ్ కపూర్, జాన్ అబ్రహాం - ప్రియా రాంచల్, జావేద్ జాఫ్రీ, సచిన్ టెండుల్కర్ - అంజలీ టెండుల్కర్, కొత్త జంట ప్రియాంకా చోప్రా - నిక్ జోనస్, సాక్షి సింగ్ ధోనీ, ధోనీ కుమార్తె జీవా కూడా ఉదయ్‌పూర్‌కు తరలివచ్చారు.