కోడెల మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నా-చంద్రబాబు

కోడెల మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నా-చంద్రబాబు

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్, సుదీర్ఘకాలం పాటు తనతో అనుబంధ ఉన్న కోడెల శివప్రసాదరావు మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... కోడెల మృతికి సంతాపం ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై సోషల్ మీడియాలో స్పందించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు... "కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వైద్యవృత్తి నుంచి తెదేపాలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు.