హోదా, విభజన‌ హామీలను తుంగలో తొక్కారు

హోదా, విభజన‌ హామీలను తుంగలో తొక్కారు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిరుమలలో శ్రీవారి దర్శించుకున్న అనంతరం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో కార్యకర్తలు, క్రియాశీల నేతలు, సేవా మిత్రలు, అభిమానులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అభ్యర్థుల జాబితా పై పార్టీ కార్యకర్తల అమోదం ఉంది. కార్యకర్తల‌ కష్డంతోనే మనం ఈ స్థాయిలో నిలబడ్డాం. ఇదే వేదిక నుంచి వెంకటేశ్వర స్వామి‌ సాక్షిగా నరేంద్ర మోడి‌ ప్రత్యేక హోదా, విభజన‌ హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి వాటిని తుంగలో తొక్కారు. మనకు న్యాయం జరగదనే రాష్డ ప్రయోజనాల కోసమే తిరుగుబాటు చేసాం. కేంద్రం ఎన్ని రకాల వత్తిడి చేసినా మనం బెదరలేదు. హైదరాబాదులో అభివృద్ది మన హాయంలోనే జరిగింది. షెడ్యూల్డ్ 9,10లో విభజన‌ జరగ లేదు. కేసిఅర్ బెదిరింపులకు భయపడే వారు ఎవ్వరు ఇక్కడ లేరు. పొలవరం ప్రాజెక్టు కు అడ్డుపడుతున్నారు. రూ.4,200 కోట్ల రూపాయలు మనకు కేంద్రం బకాయిపడింది. పోలవరం జీవనాడి. జూలైలో పోలవరం నీరు కృష్ణా, విశాఖపట్నం కు  వస్తాయి. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని కేవలం రూ.1,500 కోట్లు విడుదల చేసారు... అని చంద్రబాబు విమర్శించారు.

తిరుపతి బహిరంగ సభ అనంతరం విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. అక్కడి కోడి రామ్మూర్తి స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పార్టీ ఎజెండాను, ప్రభుత్వ మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత వారికి వివరించి చైతన్యపరచనున్నారు. అక్కడ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు.