రుణమాఫీ మూడు చెంచాల తీర్థంలా ఉంది

రుణమాఫీ మూడు చెంచాల తీర్థంలా ఉంది

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసిన రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఆశపెట్టి మోసం చేశారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. మూడు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ తిరుపతి సమీపంలోని శెట్టిపల్లిలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అమలు చేసిన రుణమాఫీ మూడు చెంచాల తీర్థం పోసినట్లుగా ఉందని విమర్శించారు. లక్ష కోట్లు రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు రూ. 20 కోట్లే చేశారని అన్నారు.ఈలోగా రైతు రుణాలపై వడ్డీలు పెరిగిపోయాయని పవన్‌ విమర్శించారు. దీంతో రైతుల రుణాలు అలాగే ఉండిపోయాయని అన్నారు. త్రికరణ శుద్ధితో అమలు చేయలేనపుడు హామీలు ఇవ్వడం దేనికని ఆయన ప్రశ్నించారు. తన కోసం ఏపీ ప్రభుత్వం నుంచి కోరలేదని, జనం కోసమే డిమాండ్‌ చేశానని అన్నారు. రైతులకు న్యాయ జరిగేంత వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు.