జగన్ జుట్టు మోడీ, కేసీఆర్ చేతిలో ఉంది

జగన్ జుట్టు మోడీ, కేసీఆర్ చేతిలో ఉంది

జగన్ జుట్టు మోడీ, కేసీఆర్ చేతిలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు సభలో ఆయన ప్రసంగించారు. జగన్ కు కేసుల భయం ఉంది, అందుకే లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన జగన్ నరేంద్ర మోడీ గెలిస్తే మైనార్టీలకు ఇబ్బందులు వస్తాయని తెలిపారు. మోడీ తిరిగి అధికారంలోకి వస్తే ముస్లీంలకు దేశంలో ఒక్క ఓటు కూడా ఉండదని అన్నారు. ఈ సారి మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని స్పష్టం చేశారు. రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు తరహాలో మిర్చి యార్డ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు చేతులు లేని దివ్యాంగులకు 10 వేలు అందచేస్తామని పేర్కొన్నారు. ఆదోని, ఆలూరు నియోజకవర్గాలు టీడీపీ కంచు కోటలని చంద్రబాబు పేర్కొన్నారు.

'పేదవారికి పెన్షన్ ఇస్తే వైసీపీకి ఇష్టం లేదు. అందుకే కోర్టు కెళ్లారు. రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతలు ఎన్నికల్లోపు అకౌంట్ లో జమచేస్తా. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాను. ప్రపంచాన్ని ఇక్కడకు తీసుకొని వస్తాను. ఇంటర్ పాస్ అయినా నిరుద్యోగ భృతి ఇస్తాం. పుస్తకాలతో పనిలేకుండా ఇంటర్ నుంచి అందరికి ల్యాప్ టాప్ అందచేస్తాం. చంద్రన్న భీమా పథకం 5 లక్షల నుండి 10లక్షలకు పెంచుతున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద 5లక్షలు ఇస్తాం. విదేశీ విద్యకు 25 లక్షలు సహాయం చేస్తాం. మీ భవిష్యత్తు నా భాద్యత. జగన్ జైలుకెళ్ల కుండా ఉండేందుకు ఒక్కసారి ఓటేయండని అడుగుతున్నాడు. ప్రతియేటా పసుపుకుంమ పథకం అమలు చేస్తా' అని చంద్రబాబు ప్రకటించారు.