పవన్ సినిమాను ఎందుకు అడ్డుకున్నారు..?

 పవన్ సినిమాను ఎందుకు అడ్డుకున్నారు..?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. కథనాయకుడిగా నటించిన చిత్రం వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. హిట్ టాక్ తెచ్చుకుంది.. అంతా బాగానే ఉన్నా.. ఏపీలో మాత్రం కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి.. అయితే, పవన్‌ కల్యాణ్‌ సినిమాను అడ్డుకున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పవన్‌ సినిమాకు ఎందుకు ఇబ్బందులు పెట్టారని ప్రశ్నించారు. తనకు పాల వ్యాపారం ఉందనే కారణంతో గుజరాత్‌ నుంచి మరో కంపెనీని తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరూ వ్యాపారాలు చేసుకోకూడదా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఇక, నిన్నటి వరకు ఎన్నికల్లో విజయంపై భయం ఉండేదని.. ఇప్పడు పూర్తి నమ్మకం వచ్చిందన్నారు చంద్రబాబు. బీజేపీతో కలిసింది తాను కాదని.. వైసీపీయేనని విమర్శించారు. పుదుచ్చేరిలో బీజేపీని గెలిపించాలని వైసీపీ ప్రచారం చేస్తుందా లేదా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై మౌనంగా ఉన్న వైఎస్ జగన్‌కు తిరుపతిలో ఓటు అడిగే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.