ప్రధాని జోక్యం చేసుకోవాలి...

ప్రధాని జోక్యం చేసుకోవాలి...

కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఢిల్లీలో ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేరళ సీఎం పినరయి విజయన్, ఏపీ సీఎం చంద్రబాబు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సతీమణిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన నేతలు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి వల్లే ఈ పరిస్థితి వచ్చింది విజయన్ ఆరోపిస్తే... కేంద్రం రాజకీయాలకు అతీతంగా స్పందించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా ఢిల్లీలో పాలనే సాగడం లేదన్నారామె.

కేజ్రీవాల్‌ను కలిసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇవ్వలేదని తెలిపారు సీఎం చంద్రబాబు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించిన ఆయన... సమాఖ్య వ్యవస్థలో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమైన విషయం అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు తాము లేఖరాసినా స్పందనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి తప్ప... ఇది సరైన పద్ధతి కాదన్నారు చంద్రబాబు. మరోవైపు ఈ వివాదంలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు కుమారస్వామి... వివాద పరిష్కారానికి కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలని... దేశరాజధానిలో తలెత్తిన సమస్యను కేంద్రమే పరిష్కరించాలన్నారు కుమారస్వామి.