అఖిలేష్ తో చంద్రబాబు భేటీ

అఖిలేష్ తో చంద్రబాబు భేటీ

రెండు రోజులుగా ఢిల్లీ బిజీబిజీగా గడిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌ లక్నో చేరుకున్నారు. ఎన్డీయే యేతర కూటమి బలోపేతానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. గంట పాటు సమావేశమైన చంద్రబాబు.. వివిధ పార్టీల అభిప్రాయాలు, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చలు జరిపారు. అనంతరం ఎల్జేడీ నేత శరత్ యాదవ్‌, సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్‌ రెడ్డి, డి.రాజాతో భేటీ అయ్యారు.