చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వస్తున్నారంటే..

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వస్తున్నారంటే..

జాతీయ స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రాంమోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారని తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఎన్నికల అధికారులను, ఎన్డీయేతర పార్టీల నాయకులను కలుస్తారని తెలిపారు. అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలనేదే లక్ష్యమని వివరించారు. సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, అఖిలేష్ యాదవ్, మాయావతి ఇతర పార్టీల నాయకులతో చంద్రబాబు సమావేశం కానున్నారని స్పష్టంచేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల కమిషన్ వ్యవరిస్తుందని విమర్శించారు. చంద్రగిరి రీపోలింగ్‌ నిర్వహణపై టీడీపీ అభ్యంతరాలకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఎన్నికలసంఘం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీ, బెంగాల్‌ పరిణామాలపై ఈసీతో చంద్రబాబు చర్చిస్తారని కంభంపాటి వెల్లడించారు.