సోనియాతో ముగిసిన చంద్రబాబు భేటీ

సోనియాతో ముగిసిన చంద్రబాబు భేటీ

యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియనుండటంతో దేశంలో రాజకీయ పరిణామాలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీయేతర పక్షాల కూటమికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో జరుగుతున్న ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చకు వచ్చాయి. ఇప్పటికే చంద్రబాబు మాయావతి, అఖిలేష్ తదితర నాయకులను కలిసి సేకరించిన అభిప్రాయాలను సోనియాకు వివరించారు. అలాగే, ఎన్నికల ఫలితాల సరళి, భవిష్యత్తు కార్యాచరణపైనా కీలకంగా చర్చించారు. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు కలిసిన విషయం తెలిసిందే.