బాబు ఆగ్రహం.. ద్వివేదికి ఫిర్యాదు

బాబు ఆగ్రహం.. ద్వివేదికి ఫిర్యాదు

అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం కలిశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పోలీసు అధికారుల బదిలీలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన వినతి పత్రం అందజేశారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రయ నిష్పక్షపాతంగా జరగాలని ద్వివేదిని కోరారు. వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, అనిల్ యాదవ్.. జగన్‌ సతీమణి భారతీ రెడ్డి అసిస్టెంట్ అనితా రెడ్డిలకు సంబంధించిన ఆడియో టేపులను సీఈఓకు చంద్రబాబు అందజేశారు. మరోవైపు.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కలిశారు. రాష్ట్రంలో అధికారుల బదిలీపై చంద్రబాబు రాసిన లేఖను ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు అందజేశారు.