బడ్జెట్‌లో కోతలతో ప్రగతికి గండి..!

బడ్జెట్‌లో కోతలతో ప్రగతికి గండి..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్రవ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... బడ్జెట్‌లో ప్రాజెక్టులకు నిధులు కోత పెట్టి ప్రగతికి గండికొట్టారని మండిపడ్డారు. వైసీపీ నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని చెప్పడానికి బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనమని విమర్శించిన చంద్రబాబు.. వైట్ పేపర్‌లో ఒకలా చెబుతారు.. బడ్జెట్‌లో మరోలా పేర్కొంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక, 2014లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రూ.6వేలే ఎక్కువ.. ఈ రోజు రూ.38 వేలు ఎక్కువ కావడం తెలుగుదేశం పార్టీ సర్కార్ ఘనత కాదా? అని ప్రశ్నించారు చంద్రబాబు.. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో 49వేల ఉద్యోగాలు వచ్చాయని లెక్కలే చెబుతున్నాయని గుర్తు చేసిన టీడీపీ అధినేత... మరోవైపు పొరుగు రాష్ట్రంలో నీళ్లు పారించేందుకే దృష్టిపెట్టారని సంచనల ఆరోపణలు చేశారు. సున్నా వడ్డీ రుణాలపై మమ్మల్ని నిలదీసిన సీఎం... ఇప్పుడు రూ.4వేల కోట్లు అవసరమైతే కేవలం రూ.100 కోట్లే కేటాయించారని విమర్శించారు. ఇక, రాజధాని అమరావతికి రూ.500 కోట్లు, కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ.250 కోట్లతో పనులెలా చేస్తారు అని ప్రశ్నించారు చంద్రబాబు.