అమరావతిలో టెన్షన్ టెన్షన్ @ బాబు లైవ్

అమరావతిలో టెన్షన్ టెన్షన్ @ బాబు లైవ్

 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంనుంచి అమరావతి పర్యటనకు బయలుదేరారు. ఎపి శాసనసభ ఎన్నికల తరువాత తొలిసారిగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించనున్నారు.  వెంకటపాలెం మీదుగా చంద్రబాబు ఉద్దండరాయపాలెం చేరుకోనున్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. గృహ సముదాయాల నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంత రైతులతో ఆయన ముచ్చటించనున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు వివరించనున్నారు. అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బాబు పర్యటనలో రైతులు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. కాన్వాయ్ మీదకి దూసుకేళ్ళెందుకు ఒక వర్గ రైతుల యత్నం చేయగా నిరసనగా మరో వర్గం ఆందోళన చేపట్టింది. దీంతో రంగంలోకి పోలీసులు పరిస్థితి చక్క దిద్దుతున్నారు.