ట్రంప్ విందుకు జగన్ ను ఆహ్వానించకపోవడానికి ఇదే కారణమా? 

ట్రంప్ విందుకు జగన్ ను ఆహ్వానించకపోవడానికి ఇదే కారణమా? 

ట్రంప్ రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో రాష్ట్రపతి భవన్ లో విందు ఇస్తున్నారు.  ఈ విందులో ట్రంప్ దంపతులతో పాటుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు.  మొత్తం 95 మంది ఈ విందుకు హాజరుకాబోతున్నారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు.  కేసీఆర్ తో పాటుగా తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు.  

అయితే, ఏపీ ముఖ్యమంత్రికి ఆహ్వానం లేకపోవడంతో సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.  అయితే, ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించడకపోవడంపై చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  జగన్ అవినీతిపరుడు అని, అందుకే ఆయన్ను ట్రంప్ విందుకు ఆహ్వానించలేదని బాబు చెప్పారు. బాబు చెప్పిన కారణాలపై వైకాపా ఎలా స్పందిస్తుందో చూడాలి.