ప్రధాని సమావేశానికి ఇద్దరు చంద్రులు డుమ్మా

ప్రధాని సమావేశానికి ఇద్దరు చంద్రులు డుమ్మా

మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఏర్పాటు చేసిన తొలి జాతీయ కమిటీ సమావేశానికి  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు డుమ్మాకొట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానిపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు థర్డ్  ఫ్రంట్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న కేసీఆర్.. ముందస్తు షెడ్యూల్ ప్రకారం నిన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తో భేటీ ఉన్న కారణంగా హాజరు కాలేనని కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఆయా కారణాల కారణంగా ఈ ఇద్దరు చంద్రులు మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల కమిటీ సమావేశానికి గైహాజరయ్యారు. ప్రధాని మోడీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల సీఎంలు, మాజీ ప్రధానులు సహా మొత్తం 114 మంది కమిటీ సభ్యులుగా ఉన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు వచ్చే సంవత్సరం అక్టోబర్ 2 న ప్రారంభమై 2020 అక్టోబర్ 2 వరకూ కొనసాగుతాయి.