గవర్నర్‌తో చంద్రబాబు ఏకాంత చర్చలు..

గవర్నర్‌తో చంద్రబాబు ఏకాంత చర్చలు..

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు.. రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్‌తో దాదాపు 50 నిమిషాల పాటు చంద్రబాబు ఏకాంతంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, ఈ భేటీకి ప్రాధాన్యత లేదంటున్నాయి టీడీపీ వర్గాలు.. మర్యాద పూర్వకంగానే గవర్నర్‌తో చంద్రబాబు సమావేశం అయ్యారని చెబుతున్నారు.