ఏపీ లక్షల కోట్ల ఆదాయం కోల్పోయింది.. 

ఏపీ లక్షల కోట్ల ఆదాయం కోల్పోయింది.. 

చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలోకి వచ్చిన సమయంలో ఆంధ్రుల రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  అమరావతిలో నిర్మాణాలు జరుగుతన్న సమయంలో ఎన్నికలు వచ్చాయి. అధికారం బదలాయింపు జరిగింది.  అధికారం బదలాయింపు కావడంతో వైకాపా అధికారంలోకి వచ్చింది.  వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిపై ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సింగపూర్ స్టార్ట్ అప్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది.  దీంతో అమరావతి నిర్మాణాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.  అమరావతి, ఇసుక, మద్యపానం తదితర అంశాలపై బాబు మాట్లాడతారు. 

అమరావతి ఆగిపోతే ప్రాజెక్టులు రావని,  సంపద ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. డబ్బులు లేకపోతె రాజధాని నిర్మాణం ఆపేస్తారా అని ప్రశ్నించారు.  రాజధాని అవసరం లేదంటారా అని ప్రశ్నించారు.   రాజధాని ఆగిపోతే తెలుగు జాతికి తీవ్రనష్టం వస్తుందని అన్నారు.   ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అమరావతిని అడ్రస్ లేకుండా చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు చంద్రబాబు.  అమరావతి నిర్మాణం జరిగితే లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, ఆదాయం తెచ్చిపెట్టే బాతును చంపేశారని చంద్రబాబు విమర్శించారు.   ప్రభుత్వం ఏర్పడ్డ ఆరునెలల్లో ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని, మద్యపాన నిషేధం విధించిన తరువాతనే మద్యం అమ్మకాలు పెరిగాయని బాబు ఎద్దేవా చేశారు.