అత్యాచార నిందితులపై చంద్రబాబు ఫైర్... 

అత్యాచార నిందితులపై చంద్రబాబు ఫైర్... 

నవంబర్ 27 వ రాత్రి దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని అతలాకుతలం చేసింది.  ఈ ఘటనతో ప్రజలు రోడ్డుమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.  విద్యార్థి సంఘాల నాయకులు కూడా రోడ్డుమీదకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  దీనిపై ఇప్పటికే అనేకమంది నాయకులు స్పందించారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు.  

కాగా, ఈరోజు కర్నూలులో చంద్రబాబు నాయుడు పర్యటించారు.  మూడు రోజులపాటి కర్నూలు జిల్లాలో బాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ పర్యటనలో భాగంగా ఈరోజు జరిగిన సమావేశంలో దిశ ఘటన గురించి బాబు మాట్లాడారు. అత్యాచారం, హత్యకు పాల్పడిన మానవ మృగాలు సమాజంలో ఉండేందుకు వీలులేదని, ఆ నిందితులకు ఉరే సరైన శిక్ష అని బాబు పేర్కొన్నారు.  నిందితులకు ఉరి శిక్ష వేయాల్సిందే అని బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.