చంద్రబాబు ఫైర్..! ఉండల్లిలో నిరాహార దీక్ష

చంద్రబాబు ఫైర్..! ఉండల్లిలో నిరాహార దీక్ష

టీడీపీ తలపెట్టిన ఛలో ఆత్మకూరును అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయను ఉండవల్లిలోనూ నివాసంలో హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డ చంద్రబాబు.. తన నివాసంలోనే నిరాహారదీక్షకు దిగారు.. రాత్రి 8 గంటల వరకు తన దీక్ష కొనసాగించనున్నట్టు ప్రకటించారు. మరోవైపు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఛలో ఆత్మకూరును అడ్డుకోవడానికి టీడీపీ నేతలను నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్న ఆయన..  ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా..? శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు వాపోయారు. ఆహారం అందించడానికి వచ్చిన వాళ్లను వెనక్కి పంపేస్తారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులకు సంఘీభావంగా అందరూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు చంద్రబాబు.. ఇవాళ ఉదయం 8 గంటలకు దీక్షకు దిగిన చంద్రబాబు.. రాత్రి 8వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అందరూ దీక్షల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.