టీడీపీ కార్యకర్తలపై 469 దాడులు..

టీడీపీ కార్యకర్తలపై 469 దాడులు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... విజయవాడలో జరుగుతోన్న టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేశారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలపై 469 దాడులు జరిగాయని వెల్లడించారు. గ్రామాలకు రావొద్దని టీడీపీ కార్యకర్తలకు పోలీసులే చెబుతున్నారన్న చంద్రబాబు.. వైసీపీ నేతలకు క్షమాపణలు చెప్పకపోతే కనీసం ఆస్పత్రులకు కూడా వెళ్లనివ్వడంలేదని ఆరోపించారు. ఇక, నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లను కూడా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత.. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగినా.. సీట్లు మాత్రం తక్కువగా వచ్చాయన్న ఆయన.. ప్రజలు తిరగబడితే వైసీపీ నిలవలేదని హెచ్చరించారు.