సాయంత్రం చంద్రబాబు రాజీనామా..

సాయంత్రం చంద్రబాబు రాజీనామా..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయనున్నారు. ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ దాదాపు 150 స్థానాల్లో ముందంలో ఉంటే.. టీడీపీ మాత్రం 25 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు లోక్‌సభ స్థానాల్లో మరీ ఘోరమైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు 24 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తుంటే... టీడీపీ ఒక స్థానానికే పరిమితమైంది. దీంతో చంద్రబాబు నాయుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. సాయంత్రం 5 గంటలకు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు చంద్రబాబు.