నేడు అనంత కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శ..

నేడు అనంత కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శ..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని.. వందకుపైగా టీడీపీ కార్యకర్తలు... వైసీపీ దాడుల్లో గాయాలపాలయ్యారని ఆరోపిస్తున్నారు. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో కూడా పలుచోట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్తలు గాయపడగా... ఇవాళ జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. ఆ కార్యకర్తలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యాన్ని చెప్పనున్నారు.