బీజేపీ పోవాలి.. ప్రత్యామ్నాయం రావాలి..

బీజేపీ పోవాలి.. ప్రత్యామ్నాయం రావాలి..

ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి కోలుకోలేని ఎదురుదెబ్బగా అభివర్ణించారు చంద్రబాబు... మూడు రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోయింది... మరో 2 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే విజయం సాధించాయని గుర్తు చేసిన టీడీపీ అధినేత... ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. దేశంలో అనేక పార్టీల నేతల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని... దేశంలో బీజేపీ పాలన పోవాలి... ప్రత్యామ్నాయం కావాలి అనేదే అందరి ఆకాంక్ష అన్నారు. ఏపీకి అన్యాయం చేసినా బీజేపీని దేశవ్యాప్తంగా తిరస్కరిస్తున్నారు... టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా ఆమోదం లభించిందన్నారు. బీజేపీయేతర పార్టీల కలయికకు ప్రజామోదం ఉంది... విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏపీకి కొన్ని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంది కాంగ్రెస్.. హోదా ఇచ్చేది లేదని చెప్పింది బీజేపీ... అందుకే బీజేపీయే మన ప్రధాన శత్రువు అన్నారు. ఈడీ, ఐటీ దాడులతో బెదిరించాలని చూస్తోందని ఆరోపించిన చంద్రబాబు... మాగుంట సంస్థలపై ఐటి దాడులే అందుకు రుజువు.. కేంద్రంలో బీజేపీ నేతలు ఏపీనే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.