తెలంగాణ ఫలితాలు వేరు.. మిగతా ఫలితాలు వేరు...

తెలంగాణ ఫలితాలు వేరు.. మిగతా ఫలితాలు వేరు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వేరు... మిగతా రాష్ట్రాల ఫలితాలు వేరు అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... అమరావతి నుంచి టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... తెలంగాణలో ముందస్తు ఎన్నికల వ్యూహం ఫలించిందన్నారు. ఏపీలో ఆదాయం తక్కువైనా పేదల సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేశామని స్పష్టం చేసిన చంద్రబాబు... రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం సంస్థాగతంగా బలపడాలని సూచించారు. ప్రతీ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలి... ప్రతీ ఒక్కరిలో పట్టుదల పెరగాలన్న ఆయన... ఇకపై అధిక సమయం పార్టీకే కేటాయిస్తానని తెలిపారు. ఈనెల 30న రాజమండ్రిలో బీసీ జయహో సదస్సు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ అధినేత... ఓటర్ల జాబితాపై ఇప్పటినుండే అందరూ దృష్టి పెట్టాలన్నారు. ఇక బీజేపీపై పోరాటానికి కేసీఆర్ కలిసిరాలేదు.. కలిసి పోటీచేద్దామంటే తిరస్కరించారు.. కానీ, ఇద్దరు ముగ్గురితో కలిసి థర్డ్ ఫ్రంట్ విఫల ప్రయోగమే అవుతుందన్నారు చంద్రబాబు. ఇది బీజేపీకి మేలు చేసే ప్రయత్నమే. అందుకే  కాంగ్రెస్ తో సహా బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత.