వీవీ ప్యాట్ల వ్యవహారంపై ఈసీకి సుప్రీం నోటీసులు

వీవీ ప్యాట్ల వ్యవహారంపై ఈసీకి సుప్రీం నోటీసులు

ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎన్డీయే వ్యతిరేక కూటమికి చెందిన 21 రాజకీయ పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈవీఎంల ఓట్లకు వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులు సరిపోల్చి చూడాల్సిందేనని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 25 కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు వివరాలు అందించేందుకు ఓ సినియర్‌ అధికారిని నియమించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈసీని ఆదేశించింది.