సుప్రీంలో బాబు కేసు 8కి వాయిదా..

సుప్రీంలో బాబు కేసు 8కి వాయిదా..

ఈవీఎంలతోపాటు 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్ పై తమ అభిప్రాయాన్ని దాఖలు చేయడానికి పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు సయమం అడగడంతో జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేసును 8వ తేదీకి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎన్డీయే వ్యతిరేక కూటమికి చెందిన 21 రాజకీయ పార్టీలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈవీఎంల ఓట్లకు వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులు సరిపోల్చి చూడాల్సిందేనని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వీవీ ప్యాట్‌లను లెక్కిస్తేనే లెక్కింపు చాలా పారదర్శకంగా ఉంటుందంటూ వివిధ పార్టీల నేతలు పిటీషన్‌లో పేర్కొన్నారు.

గతంలో అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఒక శాతం ఏదో ఒక బూత్‌లో వీవీ ప్యాట్‌నలు లెక్కిస్తే సరిపోతుందంటూ ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను సవరించాలని ప్రధానంగా పిటీషన్‌లో పేర్కొన్నారు.