ఒంగోలు ఆసుపత్రిలో రెండు రోజులుగా పడి ఉన్న మృతదేహం : చంద్రబాబు ట్వీట్

ఒంగోలు ఆసుపత్రిలో రెండు రోజులుగా పడి ఉన్న మృతదేహం : చంద్రబాబు ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మృతదేహం రెండు రోజులుగా పడి ఉందని, దానిని చూస్తే హృదయం బద్దలవుతోందని పేర్కొన్నారు. వీడియోలో గాయాలతో నేలపై పడిఉన్న వ్యక్తి మృతదేహం కనిపిస్తోంది. అంతే కాకుండా కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. "ఇది హృదయ విదారకం.! ఒంగోలు GGH ఆస్పత్రి వద్ద రెండురోజులుగా రోగి మృతదేహం పడిఉన్నా పట్టించుకోలేదు. మానవతా విలువలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారు. శవాన్ని కుక్కలు పీక్కుతుంటున్నాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. ఈఘటన ను కండించడానికి నాకు మాటలు కూడా రావడం లేదు" అని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.