అవంతి రాజీనామపై చంద్రబాబు స్పందన

అవంతి రాజీనామపై చంద్రబాబు స్పందన

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరడంపై ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. పార్టీని వీడే నాయకులను చూసి తాను భయపడనని తెలిపారు. ఐదేళ్లు టీడీపీ తరపున ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసి తనతో అన్ని పనులు చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచాతీనీచమైన ఈ చర్యకు దిగిన వాళ్లు ఎలాంటి వ్యక్తులో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కుట్రలో భాగంఆనే టీడీపీ ప్రజాప్రతినిధులను లాక్కుంటున్నారని ఆరోపించారు. తాను అభివృద్ధి చేస్తున్నందుకే వాళ్లకు భయం పట్టుకుందని సీఎం అన్నారు.