జగన్ పై దాడిని ఖండించిన చంద్రబాబు

జగన్ పై దాడిని ఖండించిన చంద్రబాబు

వైసీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధంలేని విషయమని స్పష్టంచేశారు. ఈ ఘటనను అడ్డంపెట్టుకొని అల్లర్లకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. విషయం తెలిసిన వెంటనే డీజీపీకి స్పష్టమై ఆదేశాలు ఇచ్చామని, ప్రభుత్వం సీరియస్‌గా విచారణ జరుపుతోందని, వాస్తవాలను బయటకు తీసుకొస్తామని తెలిపారు. టూ పలువురు మంత్రులు చెబుతున్నారు. జగన్‌పై దాడిని పలువురు ప్రముఖులు ముక్తకంఠంతో ఖండిస్తుండగా.. ఏపీలో పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు రోడ్లపై వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.