నోరు పారేసుకోవడం హుందాతనం కాదు

నోరు పారేసుకోవడం హుందాతనం కాదు

నోరుందని పారేసుకుంటే అందరూ పారేసుకోవచ్చని... హుందాతనం అనిపించుకోదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, నా రాజకీయ జీవితమంతా.. చేసింది చెప్పడం.. ప్రజలను చైతన్యపరచడం లాంటివి మాత్రమే చేశానన్నారు. రాజకీయ విలువను పాటించాను. సంయమనంతో వెళ్లాను. చులకనగా మాట్లాడినా.. హేళన చేసినా... కానీ ఎక్కడా రాజీపడలేదు. కేసీఆర్ ఎక్కడ నుంచి ఊడిపడ్డారు. టీడీపీ నుంచి కాదా... రాజకీయ జీవితం ఇవ్వలేదా... నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఉద్యమం ప్రారంభించి కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. ఆ తర్వాత 2009లో సీట్లు ఇవ్వనంటే పరిగెడుతూ వచ్చి ఎన్ని సీట్లంటే అన్ని సీట్లు తీసుకున్నావు. అది నిజం కాదా..? తెలంగాణ ఇస్తే.. కాంగ్రెస్‌లో కలిపేస్తా అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు. ఇప్పడు ఇడియట్స్ అంటూ పద్ధతి లేకుండా మాట్లాడతున్నారు. రాజీవ్ గాంధీ ఐటీని తీసుకొచ్చిన విషయం నిజమే.. మరి జనార్దన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు. 1995 నుంచి నాతో పాటు మీరే ఉన్నారు కదా... మీకు తెలియదా? అని ఘాటుగా విమర్శించారు.