జగన్ ఫిర్యాదుపై చంద్రబాబు కామెంట్

జగన్ ఫిర్యాదుపై చంద్రబాబు కామెంట్

గవర్నర్ కు వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఏం తప్పులు జరిగాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. అంతకన్నా ఏం చేయగలరని అన్నారు. వైసీపీ నాయకులే దాడులకు పాల్పడి, వాళ్లే ఫిర్యాదు ఎలా చేస్తారన్నారు. వీవీ పాట్ లో స్లిప్ లు కౌంటింగ్ చేస్తే నీకేందుకు భయమన్నారు. మోడీ, కేసీఆర్ వద్దన్నారా అని ఎద్దేవా చేశారు. వాళ్లిద్దరికి జగన్ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. వీవీ పాట్ లు లెక్కించి తీరాలని దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకువస్తామని స్పష్టం చేశారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చానని, అక్కడ బీజేపీ ఓడిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

'ద్రవిడ సంస్కృతి చాలా విశిష్టమైనది.. వారితో పెట్టుకున్నవారెవరూ గెలిచిన దాఖలాలు లేవే. తమిళుల ఆత్మగౌరవంతో మోడీ ఆడుకోవాలనుకున్నారు. జట్టికట్టు లాంటి విషయాల్లో తమిళులు పోరాటం అభినంద నీయమం. తమిళ రైతులు ఢిల్లీలో అర్ధనగ్న నిరసనలు తెలిపిన ప్రధాని మోడీ పట్టించుకోలేదు. ఎన్నికల ముందు సాయం చేస్తామంటూ మభ్యపెడుతున్నారు, బీజేపీకి రైతులే తగిన విధంగా బుద్ధి చెబుతారు. అన్నా డీఎంకే మోడీ చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. మోడీ చెప్పినట్టల్లా ఆడుతోంది. స్టాలిన్‌ తిరుగులేని నాయకుడిగా నిలిచారు, తమిళనాడు ప్రజలు స్టాలిన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మోడీని ఓడించేందుకు స్టాలిన్‌తో కలిసి పనిచేస్తాం. ప్రజల్లో ఉన్న అసంతృప్తి.. ఆగ్రహాలే మోడీకి బుద్ధి చెబుతాయి' అని చంద్రబాబు అన్నారు.