నేను సైతం మళ్లీ నల్లచొక్కా ధరిస్తా: చంద్రబాబు

నేను సైతం మళ్లీ నల్లచొక్కా ధరిస్తా: చంద్రబాబు

నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు విశాఖ పర్యటనకు ప్రధాని మోడీ రాక సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నేను సైతం మళ్లీ నల్లచొక్కా ధరిస్తానని తెలిపారు. ప్రత్యేక జోన్ ప్రకటనలో కూడా మనల్ని మోసం చేశారని ఆరోపించారు. సరుకు రవాణా వల్ల 95% రాయగడ్ కు వెళ్లడం వల్ల మనకు లాభం ఏమిటని ప్రశ్నించారు. మనకు రావాల్సినవి అడిగితే మనపై దాడులు చేస్తున్నారని తెలిపారు.  హైదరాబాద్ లో ఆస్తులను పంచమంటే తెలంగాణ నాయకులు కూడా బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఉండే కీలుబొమ్మను గెలిపించాలని చూస్తున్నారని ఆరోపించారు. హంద్రీ-నీవా కాలువ పూర్తి చేసి ఇప్పటికే తంబళ్లపల్లి, మదనపల్లి, పూతలపట్టుకు నీరిచ్చామని చంద్రబాబు నేతలతో అన్నారు.