హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తా..

హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తా..

విశాఖ, కాకినాడ, రాజమండ్రి నగరాలను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి తడ వరకు కోస్టల్ కారిడార్ ను నిర్మించి జాతీయ రహదార్లకు అనుసంధానం చేస్తామని తెలిపారు. పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు ఆయకట్టు రైతాంగానికి మూడు పంటలు పండెలా నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. నాడు పాదయాత్రలో కాపులను బీసీల్లో చేర్చుతామని పిఠాపురం వేదిక గా ఇచ్చిన హామీని నెరవేర్చి చూపానని తెలిపారు. రానున్న రోజుల్లో కాకినాడ సెజ్ లో వచ్చే అన్ని పరిశ్రమల్లో 50 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు బీచ్ రోడ్లులను ఆధునీకరించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.