4 రోజులకే వైఎస్ పార్టీ మారలేదా..?

4 రోజులకే వైఎస్ పార్టీ మారలేదా..?

ఏపీ అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులపై హాట్ హాట్ చర్చ జరిగింది. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. గత ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సభలో ప్రస్తావించారు. ఇక తాను డోర్ తెరిస్తే.. టీడీపీలో ఎవరూ మిగలరంటూ సీఎం జగన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పుచేసింది.. తాను ఆ తప్పు చేయనంటూ జగన్ వ్యాఖ్యానించిన తర్వాత సభలో మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాడు... తాను 1978లో తొలిసారి సభకు ఎన్నికైనప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గెలిచారని.. రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాలుగు రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తుచేశారు. అప్పుడు శ్రీరాంమూర్తి.. జగన్‌ కంటే పెద్ద ఎత్తున విమర్శలు చేశారని గుర్తుచేసిన చంద్రబాబు.. అప్పుడు మీ తండ్రి (వైఎస్ఆర్) చేసింది తప్పు అని ఒప్పుకోండి అని సవాల్ చేశారు. చరిత్రను ఎవరూ మార్చలేదు.. అది అందరూ గుర్తుపెట్టుకోవాలన్న మాజీ సీఎం... వాస్తవంగా ఎలాంటి వివాదం లేకుండా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైన సందర్భంగా తొలి ప్రసంగంలోనే అడుగడుగునా ప్రతిపక్షాన్ని కించపర్చే విధంగా సీఎం జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలక పక్షానికి గానీ, ప్రతిపక్షానికి గానీ ప్రజలు ఇచ్చిన స్థానం అన్నారు. మీది కూడా ఓ రాజకీయ కుటుంబం.. తండ్రి బాటలో నడుస్తానని చెప్పుకుంటున్న జగన్.. ఇది ఒప్పుకోవాలన్నారు చంద్రబాబు.