వైసీపీ చేతగానితనంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం!

వైసీపీ చేతగానితనంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతగానితనంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... టీడీపీ ముఖ్యనేతలతో ఇవాళ ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... వైసీపీ నేతల దౌర్జన్యాలతో పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు, పోలవరం, అమరావతి పనులు పూర్తిగా ఆగిపోయాయి, అన్నిజిల్లాల్లో అభివృద్ధి పనుల్లో ప్రతిష్టంభన నెలకొందని విమర్శించారు. ఇక, అధికార పక్షానికి పాలనపై అవగాహన లేదని మండిపడ్డ చంద్రబాబు.. ప్రతిపక్షం చెబితే వినదన్నారు. మరోవైపు పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం పేట్రేగాయని, దాడులు, దౌర్జన్యాలతో శాంతిభద్రతలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.