మంత్రి రాజీనామాపై అడ్వకేట్ జనరల్ సలహా కోరిన సీఎం..!
ఏపీలో మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ వ్యవహారంపై ఇప్పుడు చర్చగా మారింది. గతేడాది నవంబర్ 11వ తేదీన చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రావణ్‌కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. రాజ్యాంగ ప్రకారం ఆయన 11వ తేదీ నుంచి మంత్రిగా కొనసాగడానికి అవకాశం లేదు. దీంతో ఆయనతో రాజీనామా చేయించాల్సిందిగా రాజ్‌భవన్ నుంచి ఏపీ సీఎం చంద్రబాబుకు సమాచారం వెళ్లిందే. అయితే, మంత్రి శ్రావణ్‌కుమార్‌ను సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కొనసాగించవచ్చా? లేక ముందుగానే రాజీనామా చేయించాలా? అన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యాయసలహా కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అడ్వకేట్ జనరల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. శ్రావణ్ కుమార్‌ను కొనసాగించడానికి న్యాయపరంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో చూడాలని ఏజీని చంద్రబాబు కోరారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న చంద్రబాబు... తిరిగి రాగానే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. కాగా, ఇప్పటికే అమరావతి చేరుకున్న శ్రావణ్‌కుమార్.. కాసేపట్లో సీఎం పేషీ అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన రాజీనామా చేస్తారని సమాచారం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)