సింగర్‌ స్మితకు చంద్రబాబు సర్‌ప్రైజ్‌..!

సింగర్‌ స్మితకు చంద్రబాబు సర్‌ప్రైజ్‌..!

సుప్రసిద్ధ గాయని స్మిత 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే.. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమెను అభినందిస్తూ లేఖ పంపించడంతో ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. చంద్రబాబు పంపిన లేఖను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన స్మిత.. 'ఇది నిజంగా నాకు సర్‌ప్రైజ్‌. ధన్యవాదాలు చంద్రబాబు గారు' అని పోస్ట్‌ పెట్టారు. 
ఇక.. స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు ఆహ్లాదం కలిగిస్తున్నందుకు అభినందలు తెలియజేసిన బాబు..  తెలుగులో మొట్టమొదటి పాప్ ఆల్బమ్‌ను స్మిత రూపొందించడం గర్వకారణమన్నారు.