మరింత క్షీణించిన సీఎం రమేష్ ఆరోగ్యం

మరింత క్షీణించిన సీఎం రమేష్ ఆరోగ్యం

ఉక్కు పరిశ్రమ సాధన కోసం కడపలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన ఆమరణ దీక్ష 11వ రోజుకు చేరింది... బీపీ, షుగర్ లెవల్స్ పడిపోతుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇప్పటికే దీక్షలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా... 11 రోజులుగా సీఎం రమేష్ తన దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు దీక్షలో ఉన్న సీఎం రమేష్‌ను ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పరామర్శించి... ఆయన దీక్షకు సంఘీభావం తెలపనున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు టీడీపీ నేతలు.