ఇవాళ బెంగళూరుకు బాబు..

ఇవాళ బెంగళూరుకు బాబు..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ బెంగళూరు వెళ్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే లక్ష్యంతో.. ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానేదేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఆయా పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ జేడీఎస్‌తోనూ చర్చించనున్నారు.