ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు..

ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... అమరావతి నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. హస్తినలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఏపీ ఎన్నికల్లో ఈసీ తీరు, ఈవీఎంలలో లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు ఢిల్లీ  బయల్దేరారు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్ధులు, సిట్టింగ్‌ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఈసీని కలవనున్న చంద్రబాబు... రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంలపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.