టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం

టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం

తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. మళ్ళీ సీఎం చంద్రబాబే అని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులు కొన్ని పార్టీలకు మద్దతుగా ఉండటం సరికాదని అన్నారు. 43రోజుల పాటు పరిపాలన సాగనివ్వకుండా స్తంభింప చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఆపధర్మం కాదు.. అలాంటప్పుడు పరిపాలనపై సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తే ఎన్నికల సంఘానికి వచ్చిన ఇబ్బందేంటని విమర్శించారు. వర్షాకాలం ముందు పూర్తి కావలసిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోతే ఎలా అని అన్నారు. మోడీ నియంతృత్వానికి ఇదొక నిదర్శనమని తెలిపారు. ఏపీ విషయం లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే ఈసీ నడుస్తోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థను కూడా భ్రష్టుపట్టించేలా మోడీ వ్యవహరిస్తున్నారని గోరంట్ల బుచ్చియ్యచౌదరి అన్నారు.