కర్ణాటకలో ప్రచారానికి చంద్రబాబు..

కర్ణాటకలో ప్రచారానికి చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు కర్ణాటకలో జేడీ(ఎస్‌)తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరనున్న సీఎం చంద్రబాబు... సాయంత్రం 4 గంటలకు మాండ్య జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారు. పాండవపుర పట్టణంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీ(ఎస్) అభ్యర్ధి నిఖిల్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దేవెగౌడ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి దేవేగౌడ మనవడు నిఖిల్ పోటీచేస్తుండగా.. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు నటి సుమలత.