జగన్, మోడీలకు శుభాకాంక్షలుః చంద్రబాబు

జగన్, మోడీలకు శుభాకాంక్షలుః చంద్రబాబు

తిరుగులేని విజయం సాధించినందుకు ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'దేశమంతా ఫలితాలు వచ్చాయి. లెక్కింపు పూర్తయింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం అందరి బాధ్యత. వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు.. శుభాకాంక్షలు. కేంద్రంలో గెలిచిన బీజేపీ, మోడీకి శుభాకాంక్షలు. ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ గెలవడం పట్ల మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన ప్రతి కార్యకర్తకూ మనస్ఫూర్తిగా అభినందనలు. పార్టీపై అభిమానంతో ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితాలను సమీక్షించుకుంటాం’ అని చంద్రబాబు అన్నారు.