రైతు కళ్లల్లో ఆనందం చూస్తా...

రైతు కళ్లల్లో ఆనందం చూస్తా...

రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరందించే వరకూ తాన దీక్ష విరమించనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళంలో 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. నాగావళి-వంశధార, బహుదా-మహేంద్రతనయ నదులను అనుసంధానం చేస్తామన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులను కలుపుతూ మహాసంగమానికి శ్రీకారం చుడతామని బాబు చెప్పారు. రూ.900 కోట్లతో శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ కొళాయి ద్వారా నీరందిస్తామని బాబు హామీ ఇచ్చారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం రూ.300 కోట్లతో ప్రతి ఇంటికీ తాగునీరు అందే ఏర్పాటు చేస్తామన్నారు. రణస్థలంలో 50 పడకలతో ఏరియా ఆసుపత్రికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.