'కేసీఆర్‌, జగన్‌లు మోడీ వెంటే.. ఇదే రుజువు'

'కేసీఆర్‌, జగన్‌లు మోడీ వెంటే.. ఇదే రుజువు'

ఇవాళ కోల్‌కతాలో విపక్షాల ర్యాలీకి హాజరవుతున్నవారంతా మోడీ వ్యతిరేకులేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. 'ఎలక్షన్ మిషన్ 2019'పై పార్టీ నేతలతో ఇవాళ ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోల్‌కతా ర్యాలీలో పాల్గొనేందుకు 20కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారని చెప్పారు. కేసీఆర్‌, జగన్‌ తప్ప అంతా వచ్చారని తెలిపారు. కేసీఆర్‌, జగన్‌లు మోడీ వెంటే ఉన్నారనేది దీనితో సుస్పష్టమయ్యిందని అభిప్రాయపడ్డారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది అసలు లేదని.. అదో శూన్యం అని.. పెద్ద సున్నా అని బాబు అన్నారు.

ఇక.. ఇవాళ కోల్‌కతాలో విపక్షాల భారీ ఐక్య ర్యాలీకి బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానం ముస్తాబైంది. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని దేవెగౌడ సహా సుమారు 20 మంది జాతీయస్థాయి నేతలు విచ్చేస్తున్నారు.