ఒకే కార్యక్రమంలో జగన్‌, బాబు..

ఒకే కార్యక్రమంలో జగన్‌, బాబు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇవాళ ఒకే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వీరిద్దరే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికే జగన్‌, బాబు హాజరుకాబోతున్నారు. వీరితోపాటు ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా 461 మంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. ఇక.. ఇవాళ ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ కొద్దిసేపటి క్రితం మధ్యాహ్నానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రమాణ స్వీకారం ముగిశాక మధ్యాహ్నం తిరిగి సభ ప్రారంభమవుతుంది.